Wednesday, March 25, 2026
HomeHyderabadసనత్‌నగర్‌లో అగ్నిప్రమాదం

సనత్‌నగర్‌లో అగ్నిప్రమాదం

Loading

హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: సనత్‌నగర్‌లోని జింకలవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జింకలవాడలో ఉన్న డ్యూరోడైన్‌ ఇండస్ట్రీస్‌లో గురువారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

క్రమంగా అవి పరిశ్రమ మొత్తానికి విస్తరించడంలో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో నల్లని పొగ దట్టంగా అలముకున్నది.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు ఫైర్‌ఇంజన్లు, రోబో సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే షార్ట్‌సర్క్యూట్‌ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page