Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemసమస్యల పరిష్కారానికి భూ భారతి గ్రామసభ

సమస్యల పరిష్కారానికి భూ భారతి గ్రామసభ

Loading

సమస్యల పరిష్కారానికి భూ భారతి గ్రామసభ

  • బూర్గంపహాడ్ తహశీల్దార్ శిరీష

బూర్గంపహాడ్, మన భద్రాద్రి బ్యూరో

భూ సమస్యల పరిష్కారానికి నూతన భూభారతి చట్టం ద్వారా గ్రామసభలు ఏర్పాటు చేశారని తహశీల్దార్ శిరీష అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన భూ భారతి చట్టం అమలులో భాగంగా మంగళవారం గ్రామసభల ద్వారా నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో తహశీల్దార్ శిరీష అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఇరవెండి గ్రామ పంచాయతీ పరిధిలో ఎంపీపీ ఎస్ పాఠశాల నందు డిప్యూటీ తహశీల్దార్ రామ్ నరేష్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామాలలోని భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరించారు. నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామ సభలో మొత్తం 101 దరఖాస్తులు స్వీకరించారు. ఇరవెండి గ్రామసభలో 123 దరఖాస్తులు స్వీకరించారు. పలు రకాల సమస్యలపై రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ గ్రామసభకు ఆర్టీవో దామోదర్ రావు హాజరయ్యారు. గత ప్రభుత్వం రూపొందించిన ధరణిలో కొన్ని భూములు పహాణీలో ఉన్నప్పటికీ ఆన్లైన్లో నమోదు కాలేదని మరికొందరికి భూమి ఉన్న నూతనపడ్డ ఉండలేదని పుణ్యభూమిలో కొత్త భూమి ఆన్లైన్ లో నమోదయి మిగతా భూమి నమోదు కాలేదని రైతులు వారి దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు స్పందిస్తూ భూ సమస్యల పరిష్కారానికి నూతన భూ భారతి చట్టం అమల్లోకి వచ్చిందని తెలిపారు. గ్రామసభలలో ఆర్ ఐ నరసింహారావు , రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page