![]()
- అధికారులకు ఎమ్మెల్యే సూచన
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, జూన్ 03
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలంలో ఈరోజు మండల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అశ్వారావుపేట నియోజకవర్గ శాసన సభ్యులు జారే ఆదినారాయణ హాజరై మండలంలో ఉన్న పలు సమస్యలు గురించి పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా వర్షాకాలంలో తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు గురించి డాక్టర్ తనూజ, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం లకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ వర్షాకాలంలో ఎటువంటి వ్యాధులు బారిన పడకుండా గ్రామ ప్రజల్ని కాపాడాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండలంలో ఉన్న ప్రతి ఒక్క ఏఎన్ఎం ను సమస్యల గురించి తెలపమని, ఆ సమస్యలకు వివరణ ఇవ్వడం జరిగింది. ఈ వర్షాకాలంలో విద్యుత్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఏఈ కి సూచనలు ఇవ్వడం జరిగింది. మండలంలో ఉన్న పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ మండలంలో ఉన్న గ్రామపంచాయతీల్లో ప్రధాన సమస్య పంచాయతీలో ఉన్న వర్కర్స్ కి జీతాలు సమయానికి రావడం లేదని, వాటి వల్ల కూడా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు, ఎంపీడీవో అశోక్, తహశీల్దార్ సంధ్యావని, ఎంపీఓ శ్రీనివాసచారి, డిఈ నరసింహారావు, జిల్లా కోఆప్షన్ సభ్యులు రసూల్, ఎంపీటీసీ పార్వతి, సిడిపిఓ నిర్మల జ్యోతి, పంచాయతీ కార్యదర్శులు, అన్ని శాఖల అధికారులు, ఏఎన్ఎమ్ లు ఆశావర్కర్లు, అంగన్వాడి సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.


