![]()
సాకేతపురి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద సర్వసభ్య సమావేశం
బూర్గంపహాడ్, మన భద్రాద్రి న్యూస్
గత 15 రోజులుగా శ్రీ రామ జన్మభూమి తీర్ద క్షేత్ర వారి ఆధ్వర్యంలో గడప గడపకి అక్షంతలు పంపిణీ కార్యక్రమం ఏ విధంగా జరిగింది అనే విషయాలు చర్చించుట కొరకు సమావేశాన్ని పి. నాగభూషణ శాస్త్రి, మండల ప్రముఖ్ వారి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించారు. సుమారుగా 19 గ్రామాలలో 350 మంది కార్యకర్తలు పని చేసినారు. ఈ సందర్భంగా 32 వేల కుటుంబలకు శ్రీరామ స్పర్శ అక్షింతలు, కరపత్రాలు, చిత్రపటాలు పంపిణీ చేయడం జరిగినది. అయోధ్యలో శ్రీ బాల రాముని ప్రతిష్ట సందర్భంగా 21వ తేదీ, 22వ తేదీ జరపబోయే కార్యక్రమాల గురించి యోజన చేయడం జరిగినది. మండల కేంద్రమైన సాకేతపురి సారపాక గ్రామంలో 21-1- 2024, ఆదివారం సాయంకాలం నాలుగు గంటలకు శ్రీరామ శోభా యాత్ర చేయాలని నిర్ణయం జరిగినది. మండలంలో ప్రజలు, ఈ గ్రామంలో ప్రజలు అందరూ సహకరించి జయప్రదం చేయవలసిందిగా, ఆ రాముని యొక్క కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరడమైనది. అనంతరం అన్ని గ్రామాల్లో ఆలయాల వద్ద అందరూ ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని, గ్రామ ప్రముఖ్ లకు ఉచితంగా ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో 58 మంది రామభక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర, జిల్లా, మండల, గ్రామ, ప్రముఖ్ లు ఓరుగంటి సురేష్ కుమార్, ఎం.వి. సుబ్రహ్మణ్యం, పి నాగభూషణ శాస్త్రి, రాజశేఖర్, సాయి కిరణ్ శర్మ, గోవర్ధన్, పిచ్చయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.


