![]()
సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలని కోరుతూ సీఐటీయు ఆధ్వర్యంలో ఓపెన్ బ్యాలెట్
: స్వచ్ఛందంగా ఓపెన్ బ్యాలెట్ లో పాల్గొన్న కార్మికులు
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్
సెప్టెంబర్, 11
సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని కోరుతూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు)ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేస్తున్న సీటు గురువారం మరియు శుక్రవారం కార్మికుల వద్దకు వెళ్ళి ఓపెన్ బ్యాలెట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం జరుగకుండా సింగరేణి సంస్థ అధికారులు సెక్యూరిటీ సిబ్బంది మోహరించి భారీ ఎత్తున బందోబస్తు తో కార్మికులు ఈ కార్యక్రమం లో పాల్గొనకుండా నిఘా ఏర్పాటు చేసి నాయకులు గేట్ లోపలికి పోకుండా ఖటిన ఆంక్షలు యాజమాన్యం విధించినది. అయినా కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి, యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి మహ్మద్ అబ్బాస్ లు పాల్గొని మాట్లాడుతూ 2024 25 ఆర్థిక సంవత్సరం లాభాలు ప్రకటించి, 35శాతం చెల్లించాలి. సొంతింటి పథకం అమలు పర్చాలి, దీనివల్ల ప్రభుత్వానికి, కంపెనీకి లాభం చేకూరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ 42 వేల కోట్ల రూపాయలు యాజమాన్యం తిరిగి రాబట్టాలి మారుపేర్ల సమస్య తక్షణమే పరిష్కరించాలి పాన్ ఆధార్ లింక్ కాక ఇన్కమ్ టాక్స్ అధిక మొత్తంలో రికవరీ అవుతుంది డిపెండెంట్ ఉద్యోగాలు పెండింగ్లో పడుతున్నాయి అధికారులకు చెల్లిస్తున్నట్లు అలవెన్స్ (పేర్క్స్) పై ఇన్కమ్ టాక్స్ కార్మికులకు కూడా చెల్లించాలి, మెడికల్ బోర్డు ప్రతినెల నిర్వహించి గతంలో లాగా అన్ఫిట్ ఇన్ వాల్యూ డేశన్ చేయాలి,క్లారికల్ టెస్ట్ నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటివరకు టెస్ట్ నిర్వహించలేదు. వెంటనే నిర్వహించాలి, 2016 17 బ్యాచ్ జే ఎం ఈ టి వారికి ఖాళీలను తో సంబంధం లేకుండా ఓవర్మెన్ ప్రమోషన్ ఇవ్వాలి సర్ఫేస్ ఖాళీలు గతంలో ఉన్న పద్ధతి ప్రకారం భర్తీ చేయాలి బేసిక్ ప్రొటెక్షన్ కల్పించాలి ఈపీ ఆపరేటర్స్ కి ఖాళీలతో సంబంధం లేకుండా టైం టు టైం అప్డేట్ ప్రమోషన్ ఇవ్వాలి. తదితర డిమాండ్లతో సిఐటియు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరి కృష్ణ తదితర కార్మికులు పాల్గొన్నారు.


