Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemసుపరిచితుడికి కడసారి కన్నీటి వీడ్కోలు

సుపరిచితుడికి కడసారి కన్నీటి వీడ్కోలు

Loading

గుండాల, మన భద్రాద్రి న్యూస్, ఫిబ్రవరి 11

మండల కేంద్రానికి చెందిన రాచకొండ సంతోష్(32) అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. మృతుడి భౌతికకాయానికి మంగళవారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కడసారిగా అంతిమ వీడ్కోలు పలికారు. సంతోష్ గతంలో ప్రముఖ పత్రిక మన తెలంగాణ కు మండల విలేఖరిగా పని చేశాడు. మండలంలోని ప్రతీ ఇంటికి అతను సుపరిచితుడు. అందరిని ఎంతో ఆప్యాయంగా పలకరించే సంతోష్ ఇక లేడని గ్రామస్థులు కంట తడి పెట్టారు. మృతుడికి భార్య, ఒక కూతురు ఉన్నారు. సంతోష్ మరణ వార్తతో మండల కేంద్రంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page