![]()
కొత్తగూడెం, మన భద్రాద్రి జిల్లా స్టాఫర్, ఆగస్టు 03
సూర్యాపేట పట్టణంలోని రాధిక ఇన్ హాల్లో సూర్యాపేట జిల్లా సిపిఐ విస్తృత నిర్మాణ కౌన్సిల్ సమావేశం నారాయణరెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ముందుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో కూనంనేని సాంబశివరావు, పల్ల వెంకట్ రెడ్డిలు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని, ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేస్తూ పేదవాడికి కష్టం వస్తే అండగా మనం ఉన్నామని వారు అనుకునే విధంగా మన పనితనం ఉండాలని అన్నారు. పోరాటమే అంతిమ విజయాన్ని అందిస్తుందని, నిరంతరం ఉద్యమ కార్యాచరణ ఉండాలని, వచ్చే ఎన్నికలను సైతం సమర్థవంతంగా ఎదురుకోవాలని, మళ్ళీ శాసనసభ ఎన్నికలలో మనమే సొంతంగా పోటీ చేసే విధంగా సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి మనం రాలేక పొవొచ్చు కానీ ఎవరు అధికారంలోకి రావాలన్నా భారత కమ్యునిస్టు పార్టీ(సిపిఐ) అండా ఉండాల్సిందే అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, గన్న చంద్రశేఖర్, సీనియర్ నాయకులు దొడ్డ నారాయణ, పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, కౌన్సిల్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


