Wednesday, March 25, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemసైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్త వహించండి

సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్త వహించండి

Loading

సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్త వహించండి

  • మండల ఎస్సై జి స్వప్న

చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, జూలై 21

మండల ఎస్సై జి స్వప్న ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, రాష్ట్రవ్యాప్తంగా రైతులకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ అయినా సందర్భంగా రైతులు ఆనందంలో ఉంటారని, ఇదే అదునుగా భావించి సైబర్ కేటుగాళ్లు రైతుల అకౌంట్లను హ్యాక్ చేసే ప్రమాదం ఉందని అన్నారు. ప్రతి రైతు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. మీకు ఏదైనా వాట్సప్ ద్వారా గుర్తు తెలియని మెసేజ్లు వచ్చినా, ఓటీపీలు వచ్చిన ఎవరికి తెలపకుండా, అనుమానం ఉంటే వెంటనే 1930 కి డయల్ చేసి ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా ఆమె ప్రజలకు, రైతులకు సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page