Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemసొసైటీలో జరిగిన అవినీతిపై అధికారులు తక్షణమే విచారణ జరపాలి

సొసైటీలో జరిగిన అవినీతిపై అధికారులు తక్షణమే విచారణ జరపాలి

Loading

  • -బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలి

-సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా
డిమాండ్

గుండాల, మన భద్రాద్రి న్యూస్, మార్చి 24

మండల కేంద్రంలోని కోపరేటివ్ సొసైటీలో జరిగిన అవినీతిని వెలికితీసి తక్షణమే రికవరీ చేయాలని సోమవారం సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా జిల్లా నాయకులు కొమరం శాంతయ్య, మాచర్ల సత్యం లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుండాల కోపరేటివ్ సొసైటీలో 2020 నుండి 2024 వరకు ప్రజాధనాన్ని గోల్మాల్ చేశారని, మొక్కజొన్న కొనుగోలులో దాదాపుగా ఇరువై రెండు లక్షల రూపాయలు, మందు కట్టలు మొత్తం లారీలు 199, ఒక్క లారీకి 445 బస్తాలు ఒక్క బస్తాకు అదనంగా రూ. 16 చొప్పున లాభంకు అమ్ముకుని, దాదాపు 14,16,880 రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. ఫెర్టిలేజర్ పురుగు మందులు ఎక్స్పర్ అయిపోయానక రిటన్ ఇవ్వకుండా పడేసిన పురుగు మందుల విలువ అంతుచిక్కడం లేదని వాపోయారు. ఆళ్లపల్లి గోడం లీజ్ కిరాయిలు 7500 రూపాయలకు అగ్రిమెంటు ఉంటే యజమాని కిరాయి 2500 రూపాయలు ఇస్తున్నారు అంటే ప్రజల సొమ్మును ఎంతగా దోచుకుంటున్నారో అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరారు. తక్షణమే సొసైటీ యజమాన్యంపై చట్టరిత్యా చర్యలు చేపట్టాలని, ఈ నాలుగు సంవత్సరాల అవినీతిని సొసైటీ డైరెక్టర్లు మాట్లాడే సందర్భంలో సీఈఓ గా ఉన్న పూనెం రాంబాబును సస్పెండ్ చేసిన విషయం ప్రజల అందరికీ తెలిసిందేనని అన్నారు. గుండాల, ఆళ్లపల్లి మండలాల సొసైటీలలో జరుగుతున్న అవినీతులను ఆయా మండలాల ప్రజలు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పూనెం మంగయ్య, సనప కుమార్, పూనెం లక్ష్మయ్య, ఎట్టి రాంబాబు, ఊకే శ్రవణ్, కల్తి రామన్న, కల్తి సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page