Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemస్కేటింగ్ లో ఆదివాసీ ముద్దుబిడ్డ తేజస్వి విజయకేతనం

స్కేటింగ్ లో ఆదివాసీ ముద్దుబిడ్డ తేజస్వి విజయకేతనం

Loading

-మూడు పథకాలు సాధించిన ఆదివాసీ ముద్దుబిడ్డ

-జాతీయ స్థాయి కాంపీటీషన్ కు ఎంపిక

జూలూరుపాడు, మన భద్రాద్రి న్యూస్, ఏప్రిల్ 20

ఇటీవల చెన్నైలో జరిగిన కేంద్రీయ విద్యాలయ రీజనల్ స్పోర్ట్స్ మీట్ 2025 స్పీడ్ స్కేటింగ్ సబ్ జూనియర్ విభాగంలో మండల పరిధి పడమట నర్సాపురం గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన ముద్దు బిడ్డ జజ్జర తేజస్వి సత్తా చాటింది. కాంపిటీషన్ లో ఒక స్వర్ణ పథకంతో పాటు రెండు రజత పథకాలను సాధించింది. అదే విధంగా జాతీయ స్థాయి కాంపీటీషన్ కు అర్హత సాధించింది. తేజస్వి ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయం పాండిచ్చేరి లో ఆరవ తరగతి చదువు పూర్తి చేసింది. తండ్రి జజ్జర గోపి సుధీర్ కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ పాండిచ్చేరిలో విధులు నిర్వహిస్తున్నారు. తేజస్వి కేంద్రీయ విద్యాలయం పాండిచ్చేరి తరఫున పోటీలో పాల్గొని ఈ ఘనత సాధించింది. విషయం తెలుసుకున్న నర్సాపురం గ్రామస్తులు తేజస్వి తాతయ్య జజ్జర నాగేశ్వరరావు, సావిత్రి లకు, చిన్నారి తేజస్వి నికి గోపి సుధీర్ కుమార్ అలివేలు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. తేజస్వి అంతర్జాతీయ స్థాయిలో రాణించి పేరు ప్రఖ్యాతలు పొందాలని, తద్వారా గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page