![]()
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – వన మహోత్సవం
కొత్తగూడెం, మన భద్రాద్రి బ్యూరో
సమాజంలో ప్రతి ఒక్కరూ తమ పరిసరాలలో మొక్కలు పెంచడం ద్వారా వాతావరణ సమతుల్యతను కాపాడవచ్చునని, మనం మొక్కను రక్షిస్తే అది మనల్ని, మన కుటుంబాన్ని రక్షిస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ సత్యనారాయణ అన్నారు. బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు తాము పనిచేస్తున్న శాఖల్లో, తమ ఇండ్లలో మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని ఆయన సూచించారు. తమ పిల్లలకు మొక్కల పట్ల అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమ బ్యాంక్ అన్ని శాఖలు వన మహోత్సవ కార్యక్రమంలో పలుపంచుకుంటాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రమేష్ కుమార్, శ్రీనివాస రావు, అబ్దుల్ ఇజాజ్ హమీద్ ఖాన్, రీజినల్ ఆఫిస్ అధికారులు, సిబ్బంది, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


