![]()
-ఆర్టీసీని అమ్మేది లేదు
హైదరాబాద్, మన భద్రాద్రి న్యూస్, మార్చి 12
హైదరాబాదులో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంగళవారం ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్టీసీ, సింగరేణి ద్వారా దాదాపు లక్ష మందికి ఉపాధి కలుగుతోందని, ఆర్టీసీ ఆస్తులను అమ్మబోమని తేల్చిచెప్పారు.ఆర్టీసీని నష్టాలలో ఉండనీయబోమని, పరుగులు పెట్టిస్తూ ప్రజలకు సేవలు అందించేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు.


