Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemహైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుమ్ముగూడెం యువకుడు మృతి..

హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుమ్ముగూడెం యువకుడు మృతి..

Loading

హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుమ్ముగూడెం యువకుడు మృతి..

మన భద్రాద్రి న్యూస్, దుమ్ముగూడెం, మార్చి 24

హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి గ్రామానికి చెందిన యువకుడు బంటు రాజు కుమార్ (18) మృతి చెందాడు. ఈ ప్రమాద సంబంధించిన కుటుంబ సభ్యులు స్నేహితులు అందించిన వివరాల ప్రకారం.. బంటు రాజ్ కుమార్ హైదరాబాద్ నగరంలో ఉంటూ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు ఆదివారం సెలవు దినం కావడంతో తన స్నేహితుడుతో కలిసి ద్విచక్ర వాహనంపై హైవేపై బయటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు రోడ్డు డివైడర్ను ఢీకొనడంతో సంఘటన స్థలంలోనే ఇరువురు మృతి చెందారు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి రాజ్ కుమార్ మృతితో కుటుంబ సభ్యులు సున్నంబట్టి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మండలంలోని ప్రతి ఒక్కరితో ఎంతో కలివిడిగా ఉండే రాజు మృతి చెందడంతో ఆయన స్నేహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page