Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఅంబేద్కరిజం పై జరిగే దాడిని ఎదుర్కోవాలి

అంబేద్కరిజం పై జరిగే దాడిని ఎదుర్కోవాలి

Loading

అంబేద్కరిజం పై జరిగే దాడిని ఎదుర్కోవాలి

  • ప్రాథమిక హక్కులకు తూట్లు పొడుస్తున్నారు…
  • యువత అంబేద్కర్ వాదాన్ని కాపాడాలి…
    • రాజ్యాంగ రక్షణే అంతిమ లక్ష్యంగా అందరూ ఏకం కావాలి…

జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు.పిల్లి సుధాకర్

చర్ల,మన భద్రాద్రి న్యూస్, ఏప్రిల్ 22

అంబేద్కరిజం పై జరిగే దాడిని ఎదుర్కొంటూ, భారత రాజ్యాంగ రక్షణే అంతిమ లక్ష్యంగా అందరూ ఏకమై అంబేద్కర్ వాదాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ బడుగు బలహీన వర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు.చర్ల మండల పరిధిలోగల లింగాపురం గ్రామంలో భద్రాచలం నియోజకవర్గానికి చెందిన జాతీయ మాల మహానాడు నాయకుడు కొంగూరు సత్యనారాయణ ఇంట్లో సోమవారం జరిగిన కార్యక్రమానికి ఆయన రాష్ట్ర,జిల్లా నాయకులతో కలిసి హాజరయ్యారు.

అనంతరం జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఏడెల్లి గణపతి తండ్రిగారైన మాల మహానాడు సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీటీసీ ఎడెల్లి చంద్రం స్వగృహానికి వెళ్లి ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం చర్ల మండల కేంద్రంలో జరిగిన జాతీయ మాల మహానాడు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో మనువాదం కోసం అంబేద్కర్ వాదాన్ని విచ్చిన్నం చేయడానికి మనువాద శక్తులు ప్రయత్నిస్తున్నాయని, దీనిని జాతీయ మాల మహానాడు కార్యకర్తలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో ప్రాథమిక హక్కులకు తూట్లు పొడిచి అస్థిరతకు బాటలు వేస్తున్నారని,రాజ్యాంగం లోనే మన హక్కుల పేజీని ఒక్కొక్కటిగా చింపేస్తున్నారని ఆరోపించారు. యువత అంబేద్కర్ వాదాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ వాదులు రాజ్యాంగ రక్షణే అంతిమ లక్ష్యంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు జాతీయ కార్యదర్శి,జిల్లా ఇన్ ఛార్జ్ అసొద భాస్కర్, జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి, జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఏడెల్లి గణపతి, జిల్లా ఉపాధ్యక్షులు పల్లంటి రమేష్,జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ బోళ్ల వినోద్,జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు బోడ దివ్య, కార్యదర్శి మద్దేటి జయ, చర్ల మండల అధ్యక్షులు తోటమల్ల గోపాలరావు,ఇల్లందు నియోజకవర్గ సీనియర్ నాయకులు కాలే పుల్లయ్య, కొత్తగూడెం నియోజకవర్గ సీనియర్ నాయకులు గుడివాడ రాము, దాసరి అశోక్, కొత్తగూడెం మాజీ ఎంపీటీసీ కెండెం రాము,భద్రాచలం నియోజకవర్గ సీనియర్ నాయకులు కారంపూడి సాల్మన్, తోటమల్ల విజయరావు, కొంగూరు సత్యనారాయణ, తోటమల్ల వరప్రసాద్, బూర్గంపాడు నియోజకవర్గ నాయకులు పల్లంటి హరీష్, కూరపాటి దాస్, బొజ్జ వెంకటేశ్వర్లు, సెనగ సాంబశివరావు,బర్ల చింటు,బోళ్ల నాగేశ్వరరావు, బిల్లా రవి, గుడిపిటి సంతోష్, జిల్లా యువజన సంఘం నాయకులు మెల్లం పురుషోత్తం,ఉండేటి సృజన్,మహబూబాద్ జిల్లా నాయకులు వెంకటాద్రి, చిన్న హరి,చర్ల మండల నాయకులు కొంగూరు ప్రదీప్, తడికల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page