Monday, March 23, 2026
HomeTelangana NewsKhammam Newsఅక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

Loading

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం కుసుమంచిలో పట్టివేత.

పిండిప్రోలు, అజ్మీర తండా, కూసుమంచి మండలం బోడియా తండా చెందిన వ్యక్తులు సూత్రధారులు.

తిరుమలాయపాలెం, మన భద్రాద్రి న్యూస్

ఓ గ్రామంలో డంప్ చేసి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్న ఘటన మండలంలో చోటు చేసుకుంది.. పోలీసుల వివరాల ప్రకారం… కూసుమంచి బోడియాతండా గ్రామంలో TS 05 UA 8651 నెంబర్ గల టాటా ఏసీ ట్రాలీలో అక్రమంగా తరలిచడానికి సిద్ధంగా ఉన్న 40 క్వింటాల రేషన్ బియ్యాన్ని ముందస్తు సమాచారంతో కూసుమంచి ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలోనీ పోలీసుల బృందం పట్టుకుంది.. తిరుమలాయ పాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన మడికంటి శంకర్ అనే వ్యక్తి , అజ్మీరా తండాకు చెందిన చందావత్ అశోక్ , పిండిప్రోలుకు చెందిన మెట్ట శ్రీను ,అజ్మీరా తండాకు చెందిన బోడ అనిల్ ,కూసుమంచి మండలం బోడియాతండాకు చెందిన బోడా లాల్ అనే వ్యక్తుల సహకారంతో గ్రామాలలో తిరిగి రేషన్ కార్డు దారుల నుండి కేజీ బియ్యం 10 రూపాయలకు కొని 15 రూపాయలకు అమ్ముతున్నారు. వీరి రేషన్ దందా గురించి విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ నాగరాజు కు సహకరించిన వారిలో ఏఎస్ఐ కృష్ణ ప్రసాద్ ,కానిస్టేబుల్స్ బ్రహ్మం ,రాంబాబు అన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page