![]()
- భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్
భద్రాచలం, మన భద్రాద్రి బ్యూరో
రీజినల్ మేనేజర్, ట్రైఫెడ్ ఏపీ అండ్ టీజీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీన జరగవలసిన గిరిజన భవన్ భద్రాచలం నందు గిరిజనుల ద్వారా తయారు చేయబడిన హస్తకళల ఉత్పత్తులు, వి.డి.వి.కె ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు, మరియు చేనేత ఉత్పత్తుల ఎంపిక కార్యక్రమం ఈనెల 19వ తేదీకు వాయిదా వేయడం జరిగిందని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలోఎంపిక అయిన ఉత్పత్తులకు వెంటనే ట్రైఫెడ్ ద్వారా ధరను చెల్లించడం జరుగుతుందని, అంతేకాకుండా అట్టి ఉత్పత్తులను భారత దేశ వ్యాప్తంగా ఉన్న ట్రైఫెడ్ (120) విక్రయ కేంద్రాల ద్వారా విక్రయించడం జరుగుతుందని మరియు హాజరైన గిరిజన ఉత్పత్తిదారులకు రవాణా ఖర్చుల నిమిత్తం 50 కిలోమీటర్ల దూరం లోపు వారికి ఒక్కొక్కరికి రూ. 350/- మరియు 50 కిలోమీటర్ల పైబడిన వారికి ఒక్కొక్కరికి రూ. 500/- చొప్పున చెల్లించడం జరుగుతుందని, ఆరోజు విచ్చేసిన గిరిజన వ్యాపారస్తులకు భోజన సౌకర్యం కల్పించబడునని ఆయన అన్నారు. కావున కేవలం ఆసక్తికర గిరిజన ఉత్పత్తిదారులు మాత్రమే తమ యొక్క ఉత్పత్తుల నమూనాలతో జులై 19వ తేదీన ఉదయం 10 గంటలకు గిరిజన భవనం, భద్రాచలం నందు కుల ధ్రువీకరణ పత్రము, రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డులతో హాజరు కావాలని ఆయన కోరుతూ, ఇతర వివరములకు 9705499248, 9848522841, 7794921516 ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు.


