Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఅధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

Loading

  • మీరే నా బలం, మీరే నా ఆయుధం, మీరే నా బలహీనత
  • ప్రజలకు సేవ చేయడంలో ముందుండాలి
  • ప్రతి పంచాయతీ అధికారి హాజరు పట్టిక రికార్డు మెయింటైన్ చేయాలి
  • నేను పని చేసేది ఐదు సంవత్సరాలు కానీ మీరు ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు
  • ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
  • పంచాయతీ కార్యదర్శులకు ఉత్తేజాన్ని నింపిన ప్రసంగం

చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, జులై 03

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండలంలోని పంచాయతీ కార్యదర్శులు అందరూ హాజరవ్వడం జరిగింది. పంచాయతీ కార్యదర్శులు ఉద్దేశించి అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నారాయణ మాట్లాడుతూ నా పాలనలో ప్రజలు ఎవ్వరు ఇబ్బంది పడవద్దు పంచాయతీలలో మాకు ఈ సమస్య ఉందని నా దృష్టి వరకు తీసుకొని రాకుండా మీరు పని చేయాలి. మీరు చేస్తే ఆ పని నేను చేసినట్లే. మీరు నేను ఇద్దరం కలిసి ప్రజల మధ్య వారధిలా ప్రజలకే సేవ చేయాలి. ప్రతి పంచాయతీలోని సమస్యల గురించి నాకు తెలియజేయండి, నేను ఆ సమస్యను అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తాను. ముఖ్యంగా వర్షాకాలంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని వెంటనే యుద్ధ ప్రాతిపదిక పైన పనులు ప్రారంభించాలని తెలిపారు. ఈ వర్షాకాలంలో ఎక్కువగా లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరుతుంది. అలా అవ్వడం వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా వెంటనే చెరువు మట్టిని తోలకాలను ఉపయోగించి నీరు నిల్వకుండా చేయాలి. నా దృష్టి మొత్తం విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల పైనే ఉంటుంది. వాటిని మీరు విస్మరిస్తే సహించేది లేదని తెలిపారు. మీరు నాకు సహకరిస్తేనే నేను ప్రజలకు ఏమైనా చేయగలుగుతా, మీరు సహకరించుకుంటే ప్రజల మధ్యకి నేను వెళ్ళలేను. మీరు చేయని పక్షంలో ప్రజల తరఫున అధికారులకు ఏమి చేయాలో ప్రజలే చెప్తారు. అందరూ స్నేహభావంగా పని చేయాలి, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని తెలిపారు. ప్రాణం వెళ్లి మొక్కుతా ఉన్న అందరూ కలిసి ప్రజాక్షేత్రంలో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి సంజీవరావు, ఎంపీడీవో అశోక్, తహశీల్దార్ సంధ్యా వాణి, ఏపీవో శ్రీనివాస చారి, డాక్టర్ తనూజ, సిడిపిఓ నిర్మల జ్యోతి, పంచాయతీ కార్యదర్శులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page