![]()
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, జూన్ 09
మండల పరిధిలోని గానుగపాడు గ్రామపంచాయతీలోని అన్నారం తండా గ్రామానికి వెళ్లే మార్గమధ్యమున గత సంవత్సరం కురిసిన వర్షపునీరుకి రోడ్డు భాగం కొంతమేరకు కొట్టుకుపోయింది. ఇన్ని రోజులు గడుస్తున్నా అధికారులు దీనిని మాత్రం పట్టించుకునే పరిస్థితి కనపడుటలేదు. మళ్లీ వర్షాకాలం మొదలైనా ఈ సమస్యపై దృష్టి సారించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఈ రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టకపోతే వాహనదారులు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వాహనదారులు రాత్రి వేళ వెళ్లేటప్పుడు ఎక్కువ ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుకు మరమ్మత్తులు చేయించి ప్రమాదాల నుండి కాపాడాలని స్థానిక గ్రామస్థులు వేడుకుంటున్నారు.


