![]()
-దుక్కిటెద్దులను బొలెరో వాహనంలో ఎక్కించుకుని పరార్
మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, మే 15
మండల పరిధిలోని అన్నారం గ్రామంలో మంగళవారం దొంగలు హల్ చల్ చేశారు. గ్రామంలోని ఒక రైతుకు చెందిన రెండు దుక్కిటెద్దులను మంగళవారం అర్ధరాత్రి చడీ చప్పుడు కాకుండా బొలెరో వాహనంలో ఎక్కించుకొని పరారయ్యారు. బుధవారం ఉదయాన్నే ఆ రైతు నిద్ర లేచి చూడగా పశువుల కొట్టంలో కట్టేసిన రెండు ఎద్దులు కనపడకపోవడంతో, గమనించిన రైతు తన ఎద్దులను ఎవరో దొంగలించకపోయారని తెలుసుకొని కన్నీరు మున్నీరయ్యాడు.


