Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఅమాయకుల ప్రాణాలతో ఆడుకుంటున్న మొక్కజొన్న విత్తన కంపెనీలు

అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటున్న మొక్కజొన్న విత్తన కంపెనీలు

Loading

  • ఆడ, మగ మొక్కజొన్న విత్తనాలా అసలు రహస్యం ఏంటి
  • అంత ప్రాణాంతకమైన మొక్కజొన్నను ఏజెన్సీ ఏరియాలో ఎందుకు సాగు చేస్తున్నారు
  • గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న దందా
  • మొక్కజొన్న కంకులు తిని యువరైతు మృతి

జూలూరుపాడు, మన భద్రాద్రి న్యూస్

తెలుగు రాష్ట్రాల్లోని ఆడ, మగ మొక్కజొన్నల వ్యాపారం విచ్చలవిడిగా చేస్తున్న బ్రోకర్లు రైతులకు లాభాలు ఉన్నాయని ఆశ చూపించి ప్రాణాంతకమైన ఆడ మొక్కజొన్నలను ఏజెన్సీ ఏరియాలో సాగు చేపిస్తూ, మనుషుల ప్రాణాలతో చలగాటాలాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. మండల పరిధిలోని వినోబా నగర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆడ, మగ మొక్కజొన్న కంకులు తిని యువరైతు మృతిచెందిన సంఘటన ఆదివారం వినోబా నగర్ లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధి వినోబా నగర్ గ్రామానికి చెందిన జరుపులా కృష్ణ(30) అనే వ్యక్తి తన మొక్కజొన్న తోటలో కంకులను తిని శనివారం రాత్రి తీవ్ర ఒళ్ళు నొప్పులు, శరీరం సచ్చుబడి, అనారోగ్యం పాలై బాధపడుతుంటే గమనించిన కుటుంబ సభ్యులు ఆదివారం కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. ఏది ఏమైనా ప్రకృతికి, ప్రాణకోటికి హానికరమైన ఇలాంటి పంట సాగు విషయంలో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. విషపూరితమైన పంట సాగు వెనక వాస్తవాలను వెలికి తీసి, కారణమైన కంపెనీలపై చర్యలు తీసుకొని, రాష్ట్రవ్యాప్తంగా ఈ విత్తనాలను బ్యాన్ చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page