![]()
-స్కూలు గ్రాండ్ కు వినియోగించిన వివరాలు క్యాష్ బుక్ లో వెంటనే నమోదు చేయాలి
గుండాల, మన భద్రాద్రి న్యూస్, మే 30
మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాల పనుల యొక్క పర్యవేక్షణలో భాగంగా జిల్లా విద్యాధికారి ఎం వెంకటేశ్వరా చారి, జిల్లా ప్లానింగ్ కో – ఆర్డినేటర్ నగిన సతీష్ కుమార్ లు గురువారం మండలంలోని పాఠశాలలను సందర్శించి, జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా ఎంపీపీస్ మోదుగులగూడెం పాఠశాల సందర్శించినప్పుడు ఆ పాఠశాలలో డ్రింకింగ్ వాటర్ కోసం ఏర్పాటు చేసిన ట్యాంక్ సరిగా లేదని, దానిని వెంటనే సరి చేయాలని సూచించారు. ఎంపీపీస్ ముక్తి గుంపు పాఠశాలలో రిపేర్లు అవసరం ఉన్నప్పటికీ ఎస్టిమేషన్ పెట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎంపీపీస్ పడుగోనిగూడెం పాఠశాలలో స్కూల్ గ్రాండ్ వినియోగంపై రికార్డులు చూపకపోవడంపై షోకాజు నోటీస్ జారీ చేశారు. గుండాల జెడ్పీహెచ్ఎస్ పాఠశాల కాంప్లెక్స్ కు సంబంధించి అన్ని రికార్డులు పరిశీలించి, ఖర్చు వివరాలు సరిగా నమోదు చేయాలని, నిధులు దుర్వినియోగం జరిగినచో శాఖ పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం మండలంలోని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులలో ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి, సకాలంలో పనులన్నీ పూర్తయ్యే విధంగా చూడాలని, ప్రతి పాఠశాలకు ట్యాబును ఇవ్వడం జరిగిందని, ఫ్రీగా డేటా కూడా అందిస్తున్నామని, వాటిని ఉపయోగించి రిపోర్టింగ్ వెంటనే చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ, ఎంఈఓ కృష్ణయ్య, ఎంఎన్ఓ పార్వతమ్మ, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఎంఐఎస్, సీసీఓలు, సీఆర్పీలు పాల్గొన్నారు.


