![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, ఏప్రిల్ 16
ప్రపంచం మొత్తం డిజిటల్ యుగం రాజ్యమేలుతుంది. రోజువారీగా ఒక వినియోగదారుడు డిజిటల్ పేమెంట్ (ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, ఇతరాత్ర పేమెంట్ యాప్స్) ద్వారా పది రూపాయలు మొదలు లక్ష రూపాయల వరకూ తమ లావాదేవీలను కొనసాగిస్తుండడం ద్వారా కరెన్సీ ప్రస్తుత పరిస్థితిలో చూద్దామన్న కంటికి కనబడటం లేదు. ఇలాంటి పరిస్థితులలో కొన్ని పేమెంట్స్ యాప్స్(ఫోన్ పే, ఇతరాత్ర) ద్వారా డబ్బులు పంపే వ్యక్తి మనీ ట్రాన్సాక్షన్స్ జరిపితే ట్రాన్సాక్షన్ సక్సెస్ అని మెస్సేజ్ వస్తే, ట్రాన్సాక్షన్ హిస్టరీలో చెక్ చేసి చూసినప్పుడు డెబిటెడ్ అని చూపిస్తుంది. రిసీవ్ చేసుకునే వ్యక్తికి కూడా మెసేజ్ వచ్చి, ట్రాన్సాక్షన్ హిస్టరీలో చెక్ చేస్తే క్రెడిటెడ్ అని చూపిస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ డబ్బులు పంపిన వ్యక్తి అకౌంట్లో నుండి మనీ కట్ కావడం లేదు. అలాగే రిసీవ్ చేసుకున్న వ్యక్తికి మనీ యాడ్ కావడం లేదు. దీంతో మండలంలోని వినియోగదారులు బ్యాంక్ సమస్యనా లేక పేమెంట్ యాప్ సమస్యనా తెలియక అయోమయ పరిస్థితికి గురికావాల్సి వస్తుంది. ఇలా కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు మాత్రమే జరుగుతుందా లేదా మిగతా బ్యాంకులకు కూడా ఇలానే జరుగుతుందా తెలియాల్సి ఉంది. దీనిపై ఇప్పటివరకు బ్యాంకులు గానీ, డిజిటల్ పేమెంట్స్ యాప్స్ గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.


