![]()
-శాసన సభ్యులు కూనంనేని
కొత్తగూడెం, మన భద్రాద్రి బ్యూరో, జనవరి 22
పాత కొత్తగూడెం నాలుగవ వార్డులో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా అర్హుల కొరకు బుధవారం ఏర్పాటు చేసిన వార్డు సభలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అధికారులు లబ్ధిదారుల ఎంపిక విషయంలో అర్హులైన వారికి అన్యాయం జరగకుండా చూడాలని, అర్హులైన ప్రతీ ఒక్కరిని గుర్తించాలని, ఎక్కడా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఈ ఎంపిక జరగాలని కోరారు. నో రికమండేషన్స్ అని, ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారుల ఎంపికలో అధికారులకు పూర్తిస్థాయి సమాచారాన్ని తెలియజేస్తూ, న్యాయబద్దంగా ఎంపిక ప్రక్రియ కొనసాగించాలని అన్నారు. విడతల వారీగా నియోజకవర్గ వ్యాప్తంగా మంజూరయ్యే ఇందిరమ్మ ఇల్లు ప్రతీ పేదవాడికి అందే విధంగా చూస్తానని, అర్హులైన ప్రతీ పేదవాడికి రేషన్ కార్డు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. రైతు భరోసాకు ప్రతీ రైతును గుర్తించాలని వారు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాభీర్ పాషా, ఆర్ఐ అలిమ్, వార్డు ఆఫీసర్స్ రమూర్తి, నాగశ్రీ, జూనియర్ అసిస్టెంట్ రవికుమార్, బిల్ కలెక్టర్ సంతోష్, రికార్డు అసిస్టెంట్ జవిద్ పాషా, వార్డు మెంబర్ సుజాత, ఇందిరమ్మ కమిటీ సభ్యులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, భాగ్యలక్ష్మి, సాంబ, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


