Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఅశ్వాపురం, మణుగూరు మండలాలలో విద్యాసంస్థల భారత్ బంద్ విజయవంతం

అశ్వాపురం, మణుగూరు మండలాలలో విద్యాసంస్థల భారత్ బంద్ విజయవంతం

Loading

మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, జులై 04

దేశ విద్యారంగాన్ని అబాసుపాలు చేస్తున్న మోధీ ప్రభుత్వాన్ని వెంటనే బర్త్ రఫ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు గురువారం డిమాండ్ చేశారు. గురువారం విద్యాసంస్థల భారత్ బంద్ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ ఎస్ యు ఐ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా మండలాల పరిధిలోని జూనియర్ కళాశాల, కస్తూరిబా, హైస్కూల్, ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు ఈ బంద్ లో సంపూర్ణంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తూ పేపర్ లీకులు, స్కాములు, పరీక్షల రద్దు ద్వారా దేశ ప్రతిష్టను, పరువును తీస్తున్నారని అన్నారు. లీక్ అయినట్లు నిందితులు అంగీకరించిన తర్వాత కూడా కేంద్రం విచారణ చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page