![]()
జూలూరుపాడు, మన భద్రాద్రి న్యూస్
మండల కేంద్రంలోని పడమట నర్సాపురం గ్రామపంచాయతీలో గ్రామ సెక్రటరీగా బి తిరుపతిరావు విధులు నిర్వహిస్తున్నారు. కానీ గ్రామపంచాయతీలో ఎటువంటి పనులను ఆయన చేయించడం లేదని ప్రజల ఆరోపిస్తున్నారు. వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న కారణంగా వీధుల్లో డ్రైనేజీలు దుర్భరంగా మారాయి. అయినా కూడా బ్లీచింగ్, డ్రైనేజీ క్లీనింగ్ లాంటి పారిశుద్ధ్య పనులు, వీధులలో ఉన్నటువంటి చెత్త తీసివేయడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ గ్రామపంచాయతీలో ఎనిమిది మంది శానిటేషన్ వర్కర్లు ఉన్నా కూడా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి దోమల వలన విష జ్వరాలు సోకకుండా బ్లీచింగ్, ఫాగింగ్, డ్రైనేజీ క్లీనింగ్ చేయించాలని ప్రజలు కోరుతున్నారు.


