Monday, March 23, 2026
HomeNational Newsఆగస్టు 13న దేశ వ్యాప్త నిరసన.. కార్మిక, రైతు సంఘాల పిలుపు

ఆగస్టు 13న దేశ వ్యాప్త నిరసన.. కార్మిక, రైతు సంఘాల పిలుపు

Loading

మన భద్రాద్రి వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు, భారత్, బ్రిటన్ మధ్య జరిగిన స్వేచ్చా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ (CTU), సంయుక్త కిసాన్ మోర్చా (SKM)లు ఆగస్టు 13న దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చాయి.

ఈ మేరకు సీటీయూ, ఎస్‌కేఎంలు సోమవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ‘ఆగస్టు 13న దేశ వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నాం. ఇందులో భాగంగా బైక్, ట్రాక్టర్ ర్యాలీలు, బహిరంగ ప్రదర్శనలు సహా ఇతర కార్యక్రమాలుంటాయి. రైతులు, కార్మికులు, విద్యార్థులు, దేశభక్తి గల పౌరులందరూ పాల్గొనాలి’ అని తెలిపాయి. ట్రంప్ సుంకాల బెదిరింపులను భారత్ తిరస్కరించాలని, రష్యాతో సహా అన్ని దేశాలతో వ్యాపారం చేయడానికి తన హక్కును నొక్కి చెప్పాలని డిమాండ్ చేశారు. ఇండియా- యూకే సీఈటీఏ డీల్‌ను వెంటనే సమీక్షించి సవరించాలని తెలిపారు. కార్మికుల సార్వభౌమాధికారం, స్వేచ్ఛను కాపాడటానికి తాము ఎల్లప్పుడూ మద్దతిస్తామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page