Tuesday, March 24, 2026
HomeTelangana Newsఆదివాసీలకు అండగా మేమున్నాం

ఆదివాసీలకు అండగా మేమున్నాం

Loading

ఆదివాసీలకు అండగా మేమున్నాం

  • కమాండెంట్ రాజీవ్ కుమార్
  • చెలిమెల లో 151 బెటాలియన్ సివిక్ యాక్షన్ ప్రోగ్రాం
  • చిన్నారులకు విద్యా సామాగ్రి, యువతకు క్రీడా సామాన్లు పంపిణీ

చర్ల, మన భద్రాద్రి న్యూస్, మార్చి 23

మారుమూల ఆదివాసి గ్రామాల్లో శాంతిని పునరుద్ధరించి నక్సలిజాన్ని నిర్మూలించేందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కూడా నిత్య ఎంత ఉందని సిఆర్పిఎఫ్ 151 బెటాలియన్ కమాండెంట్ రాజీవ్ కుమార్ అన్నారు. మండలంలోని మారుమూల గ్రామమైన చెలిమే లలో ఆదివారం సిఆర్పిఎఫ్ 151 బెటాలియన్ ఆధ్వర్యంలో సుజుకి యాక్షన్ ప్రోగ్రాంలో నిర్వహించారు. చెలిమెల, రాళ్ళపురం గ్రామాల్లో సివికేషనల్ ప్రోగ్రాంలో నిర్వహించారు. ప్రోగ్రాంలో స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సందర్భంగా సిఆర్పిఎఫ్ 151 బెటాలియన్ కమాండెంట్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో శాంతిని పునరుద్ధరించిన నక్సలిజాన్ని నిర్మించేందుకు సిఆర్పిఎఫ్ ముందుంటుందని అన్నారు. గ్రామస్తులు తమ పిల్లలను పాఠశాలలకు పంపాలని నేటి సమాజంలో పిల్లలకు విద్య ఎంతో అవసరమని అన్నారు. పిల్లలకు స్కూల్ డ్రస్సు, బ్యాగులు, నోటు బుక్కులు, పుస్తకాలు, స్టేషనరీ తదితర సామాగ్రిని అందించారు.

గ్రామంలో ఏ సమస్య వచ్చినా సమీపంలోని సిఆర్పిఎఫ్ శిబిరాన్ని సంప్రదించాలని గ్రామస్తులకు సూచించారు. అధికారులను సంప్రదించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సివిక్ యాక్షన్ ప్రోగ్రాం లో భాగంగా గ్రామస్తులకు నిత్యవసర వస్తువులు, సైకిల్లు, చీరలు, ధోతి వ్యవసాయ పరికరాలు అందించారు. గ్రామంలోని యువతకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా విద్య క్రీడల వైపు మగ్గుచూపాలని, క్రీడల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి గ్రామానికి మంచి పేరు తేవాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ 151 బెటాలియన్ అధికారులు, చెలిమెల, రాళ్ల పురం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page