Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఆదివాసీల అభ్యున్నతికి అడుగులు..

ఆదివాసీల అభ్యున్నతికి అడుగులు..

Loading

ఆదివాసీల అభ్యున్నతికి అడుగులు..

సిఆర్పిఎఫ్ 196 బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ గుల్సన్ టిర్కే

చర్ల,మన భద్రాద్రి న్యూస్,మే 16

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆదివాసీల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్నామని సీఆర్పీఎఫ్ 196 బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ గుల్సన్ టిర్కే అన్నారు. తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దులోని కర్రెగుట్ట ఏరియా పరిధిలోని అత్యంత మావోయిస్టు ప్రభావిత పూజారికాంకెర్లో ఏర్పాటు చేసిన మొబైల్ టవర్ ను శుక్రవారం అసిస్టెంట్ కమాండెంట్లు రమేష్ నాయక్, హరీష్ , ప్రేమ్జిత్ ల తో కలసి ప్రారంభించారు. ప్రభుత్వం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన ద్వారా అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో మావోయిస్టులకు సహకరించవద్దని సూచించారు. ఆదివాసి అభివృద్ధికి సిఆర్పిఎఫ్ తమ వంతు కృషి చేస్తుందన్నారు. గ్రామాల్లో విద్య ,వైద్య, సమాచార వ్యవస్థలు మెరుగు పడటం ద్వారా అభివృద్ధి ఇట్టే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీలు, సిఆర్పిఎఫ్ జవాన్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page