![]()
ఢిల్లీ, మన భద్రాద్రి వెబ్ డెస్క్: దేశంలో అనర్హులు, చొరబాటుదారులు.. ఆధార్ కార్డులు పొందుతున్నారని భాజపా ఎంపీలు ఆరోపించారు. ముందు అక్రమంగా ఆధార్ కార్డు పొంది.. ఆ తర్వాత ఓటరు గుర్తింపు కార్డు తదితర అధికారిక పత్రాలను పొందుతున్నారని, భారతీయ పౌరులకే దక్కాల్సిన ప్రయోజనాలను కొల్లగొడుతున్నారని విమర్శించారు.
గురువారం జరిగిన ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ నేతృత్వంలోని పీఏసీ.. ఈ సమావేశంలో యూఐడీఏఐ పని తీరును సమీక్షించింది. ఆధార్‌లో నమోదైన తప్పిదాలను సరి చేసే ప్రక్రియను సరళీకరించాల్సిన అవసరం ఉందని కొందరు సభ్యులు అభిప్రాయపడ్డారు. ప్రజలందరూ ఆధార్ పొందాలని సంబంధిత అధికారులు సర్క్యులర్ జారీ చేయాలని, ఆధార్ పొందే ప్రక్రియను సరళీకరించే మార్గాలను పరిశీలించాలని కమిటీ సూచించింది. ఆధార్ అనేది సామాన్యుడి సమస్య. దీనిపై సభ్యులు అనేక ప్రశ్నలు లేవనెత్తారని వేణుగోపాల్ అన్నారు.


