![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, జనవరి 25
గుండాల ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన కొప్పుల శ్రీను(34) ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడి దశదిన కర్మలకు శనివారం గుండాల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీను కుటుంబానికి క్వింటా బియ్యం మరియు పదిహేను కేజీల నూనెను అందించి తమ మానవత్వం చాటుకున్నారు. ఈ వితరణ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు, మానాల నారాయణమూర్తి, మానాల వీరన్న, మానాల ప్రభాకర్, గౌరిశెట్టి సత్యనారాయణ, గౌరిశెట్టి ప్రభాకర్, మానాల శ్రావణ్, మానాల సతీష్, మానాల ప్రణీత్, గౌరిశెట్టి శరత్, తవిడిశెట్టి నాగరాజు, మానాల ఉపేందర్, శ్రీరంగం శ్రీనివాస్, తవిడిశెట్టి రాంబాబు, తాటిపల్లి సత్యం, అయితా శ్రీశైలం, అయితా నాగ మల్లయ్య, అయితా పూజీత్, తాటికొండ వీరన్న, పాలడుగు భారత్, గోలి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.


