![]()
- సమయస్ఫూర్తితో బాలుని ప్రాణం కాపాడిన గ్రామీణ వైద్యుడు
జూలూరుపాడు, మన భద్రాద్రి న్యూస్
మండల కేంద్రంలో ఆర్ఎంపి వైద్యుడిగా పనిచేస్తున్న ఉసికల నరసింహారావును గుండెపుడి గ్రామ ప్రజలతో పాటు మండలానికి చెందిన పలువురు అభినందించారు. వివరాల్లోకెళ్తే గుండెపుడి గ్రామానికి చెందిన ఐదు సంవత్సరాల బాలుడు మంగళవారం కరెంటు షాక్ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న బాలుడును ఆర్.ఎం.పి వైద్యుడు ఉసికల నరసింహారావు దగ్గరకు తీసుకుని రాగా సీపీఆర్ చేసి (ప్రధమ చికిత్స) ప్రాణాన్ని కాపాడాడు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం హాస్పిటల్ కు తరలించారు. బుధవారం బాబు ఆరోగ్యంగా ఉన్నాడని బాలుడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామీణ వైద్యుడు నరసింహా రావు సమయస్ఫూర్తితో సిపిఆర్ చేయడం వల్లే బ్రతికాడని డాక్టర్ నరసింహారావుకు బాబు తల్లిదండ్రులతో పాటు పలువురు గ్రామస్తులు కృతజ్ఞతాభినందనలు తెలిపారు.


