Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఇండియా ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివ్‌ (ఐఐఎస్‌ఎఫ్‌) -2024 లో సెయింట్ పాల్స్ ప్రాతినిధ్యం

ఇండియా ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివ్‌ (ఐఐఎస్‌ఎఫ్‌) -2024 లో సెయింట్ పాల్స్ ప్రాతినిధ్యం

Loading

ఇండియా ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివ్‌ (ఐఐఎస్‌ఎఫ్‌) -2024 లో సెయింట్ పాల్స్ ప్రాతినిధ్యం

భద్రాచలం, మన భద్రాద్రి

శాస్త్రీయ భావనలు, ఆవిష్కరణలపై అవగాహన అనే కార్యక్రమం ఫరీదాబాద్ హర్యానాలో నిర్వహించిన ఇండియా ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివ్‌ (ఐఐఎస్‌ఎఫ్‌) -2024 లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి నలుగురు ఉపాధ్యాయులు, ఏడుగురు విద్యార్థులు పాలు పంచుకున్నారు. ఈ వర్క్‌ షాపులో మొత్తం 17 విభాగాలపై చర్చించారు. భద్రాచలం సెయింట్ పాల్స్ విద్యార్థి ఎన్ కిషన్ ఆదర్శ్ పదవ తరగతి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు తెలంగాణ రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించాడు.

ఈ సదస్సులో 23 దేశాల నుండి పదివేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలను కలుసుకోవడం, భవిష్యత్తుకు సంబంధించిన శాస్త్ర విజ్ఞానిక పరిశోధనలకు సంబంధించిన అంశాలను, సైన్సు ఉపాధ్యాయుల వర్క్‌ షాపు సృజనాత్మకత, శాస్త్రీయ భావనలతో ఆవిష్కరణలను తెలుసుకోవడానికి ఇది సదవకాశమని విద్యార్థి తెలియజేశాడు. ఇంతటి సదవకాశం కల్పించిన పాఠశాల హెడ్ మిస్టరీస్ డాక్టర్ కే రాధ మంజరి కి, ప్రిన్సిపాల్ కె అబ్రహం కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ సదావకాశాన్ని కల్పించిన జిల్లా సైన్స్ విభాగం అధికారి శ్రీ చలపతి రాజుకి, పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె అబ్రహం మరియు హెడ్ మిస్ట్రెస్ డాక్టర్ కే రాధా మంజరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రాతినిధ్యం వహించిన కిషన్ ఆదర్శను ప్రత్యేకంగా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ, భవిష్యత్తు శాస్త్రవేత్తగా ఎదగాలని ఆకాంక్షిస్తూ, భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రోత్సాహం మరియు ప్రాతినిధ్యం ఉంటుందని తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page