![]()
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలో పలుచోట్ల అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 15 లారీలను మైనింగ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అట్టి లారీల పత్రాలను చెక్ చేసి అనుమతులు లేని వాటిని బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మిగిలిన లారీలను కూడా పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు బూర్గంపహాడ్ పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉంది. బూర్గంపహాడ్ అదనపు ఎస్సై నాగ బిక్షం మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, వారిని శిక్షార్హులుగా గుర్తిస్తామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.


