Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఇసుక తవ్వకాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి : మచ్చా

ఇసుక తవ్వకాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి : మచ్చా

Loading

ఇసుక తవ్వకాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి : మచ్చా

చర్ల, మన భద్రాద్రి న్యూస్,మే 16

ఏజెన్సీలో ఇసుక తవ్వకాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. చర్ల లో బిఎస్ రామయ్య భవన్లో పార్టీ మండల కార్యదర్శి మచ్చ రామారావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన పార్టీ కార్యవర్గ సదస్సు లో ఆయన మాట్లాడారు.చట్టాలను పాతరేసి గ్రామ పంచాయతీల అభివృద్ధి పేరిట జరుగుతున్న ఇసుక తవ్వకాల్లో పూర్తి పర్యవేక్షణ కొరవడిందన్నారు. సరిహద్దులకు మించి గోదావరిలో విచ్చలవిడిగా జరుగుతున్న తవ్వకాలపై ఉన్నతాధికారుల చోద్యం చూడటం దారుణం అన్నారు. ఇసుక క్వారీల ఏర్పాటు కు తమ పార్టీ వ్యతిరేకం కాదని.. గిరిజనులకు పూర్తిగా ఉపాధి కల్పించేలా తవ్వకాలు జరగాలని.. తద్వారా గ్రామాలు అభివృద్ధి చెందాలనేది తమ పార్టీ లక్ష్యం అన్నారు. ఏజెన్సీలో ఇసుక తవ్వకాలపై అధికారులు ఎవ్వరికి వారుగా కుమ్మక్కవడంతో గౌరవ న్యాయస్థానం చొరవ చూపి ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై నిజాలు నిగ్గు తేలేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు కొలగాని బ్రహ్మచారి, పొడుపు గంటి సమ్మక్క ,బందెల చంటి, పామరు బాలాజీ సింగ్, తాటి నాగమణి ,వరలక్ష్మి పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page