![]()
-ప్రిన్సిపాల్ సంధ్యారాణి
గుండాల, మన భద్రాద్రి న్యూస్, మే 15
మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కళాశాలలో అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థి, విద్యార్థినులు మే 18వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలని ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపాల్ సంధ్యారాణి బుధవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ పదో తరగతిలో వచ్చిన పర్సంటేజ్ ప్రకారము ఎంపికలు ఉంటాయని,
ఇంటర్మీడియట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఈనెల 22వ తారీఖున ఉదయం 9 గంటలకు ఈఎంఆర్ఎస్ పాఠశాల భద్రాచలం నందు నిర్వహించబడతాయని తెలిపారు. అలాగే దరఖాస్తు ఫారం ఈఎంఆర్ఎస్ పాఠశాలలో అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని విద్యార్థి, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.


