Monday, March 23, 2026
HomeMovie Newsఈడీ విచారణకు మంచు లక్ష‍్మీ

ఈడీ విచారణకు మంచు లక్ష‍్మీ

Loading

మన భద్రాద్రి వెబ్ డెస్క్: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ సాగుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేశారు. అలా ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. గంటల పాటు సాగిన విచారణకు సహకరించారు. ఇప్పుడు బుధవారం(ఆగస్టు 13) నాడు మంచు లక్ష‍్మీ ఈడీ అధికారుల ముందు హాజరుకానుంది.

ఈ రోజు 11 గంటలకు వ్యక్తిగతంగా మంచు లక్ష‍్మీ.. ఈడీ కార్యాలయానికి రానుంది. ఇ‍ప్పటికే సంబంధిత వివరాలు తీసుకురావాలని ఈమెకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అక్రమ మార్గంలో అనధికారికంగా వచ్చిన డబ్బు ఎంత తీసుకున్నారు? ప్రమోషన్‌తో ఎంత లాభం చేకూరింది? తదితర అంశాల గురించి ప్రశ్నించనున్నారు. మనీ లాండరింగ్ అంశాలపైన కూడా దర్యాప్తు కొనసాగించనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page