![]()
-పర్యావరణ శాఖ పిలుపు
మన భద్రాద్రి న్యూస్, మార్చి 23
దేశవ్యాప్తంగా ఇవాళ ఎర్త్ అవర్ నిర్వహించనున్నారు. వాతావరణంలో మార్పులు, జీవవైవిధ్యానికి జరుగుతున్న నష్టాన్ని కొంతమేరకైనా తగ్గించేందుకు పర్యావరణ శాఖ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఈ రోజు రాత్రి 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు అందరూ విద్యుత్ దీపాలను ఆఫ్ చేయాలని పర్యావరణ శాఖ కోరింది. ప్రజలంతా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపింది. మన వంతుగా కూడా ఈ రోజు గంటపాటు లైట్లను ఆఫ్ చేసి పర్యావరణానికి కొంతైనా నష్టంవాటిల్లకుండా కృషి చేద్దాం.


