![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, మే 31
మండల కేంద్రంలో శుక్రవారం ఎండ తీవ్రత విపరీతంగా పెరిగింది. ఎండ 41 డిగ్రీలు దాటడంతో చిన్నారులు, వృద్ధులు, పెద్దలు అల్లాడిపోయారు. మండల కేంద్రంలో మధ్యాహ్నం వేళలో జనాలు లేక వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 8 గంటల నుండే భానుడు తన విశ్వరూపం చూపిస్తూ, విరుచుకుపడుతున్నాడు. గుండాలలోని ఒక చికెన్ షాపులో సుమారు రూ. 6000 విలువ గల పదమూడు బ్రాయిలర్ కోళ్లు శుక్రవారం కొట్టిన ఎండ తీవ్రత ప్రభావంతో మృత్యువాత పడ్డాయి. దీంతో షాప్ యజమాని నష్టపోయి, ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. రోజురోజుకీ పెరుగుతున్న ఎండలకు మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక పశుపక్షాదుల పరిస్థితి వర్ణనాతీతం.


