![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: ఒకరు ఎంత మద్యం తాగాలో ఆ సీసాపై సూచించాలని కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది.
రాష్ట్రంలోని టాస్మాక్ దుకాణాల సంఖ్య క్రమంగా తగ్గించి, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేయాలని ప్రభుత్వానికి ఉత్తర్వులివ్వాలని అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే శ్రీధరన్ మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ఎం.ఎం శ్రీవాస్తవ, జస్టిస్ సుందరమోహన్ ధర్మాసనం మద్యం సీసాపై మద్యపానం ఆరోగ్యానికి హానికరమని సూచించిన నేపథ్యంలో ఒకరు ఎంత తాగాలో సూచించాలని ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని తెలిపారు. మద్యం దుకాణాల సంఖ్య తగ్గింపుపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని తెలిపి పిటిషన్ కొట్టివేశారు.


