Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

Loading

ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్

విశ్వావసు నామ సంవత్సరంలో నియోజకవర్గంలో ప్రతి ఇల్లు సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరికి మంచి జరిగే ఆనందంగా ఉండాలని ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా ఆదివారం ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉగాది పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు కోరం కనకయ్య – లక్ష్మి మరియు వారి మిత్రబృందం సాంప్రదాయ వస్త్రాలతో పాల్గొన్నారు. విశ్వావసు నామ సంవత్సర పంచాంగ పటనాన్ని ఆలకించారు. అనంతరం ఉగాది పచ్చడిని స్వీకరించారు. ఎమ్మెల్యే రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, నియోజకవర్గ నాయకులు మండల రాము, మడుగు సాంబమూర్తి, బొల్లా సూర్యం, చిల్ల శ్రీనివాస్, పట్టణ మండల అధ్యక్షులు, మాజీ చైర్మన్లు, పట్టణ మండల కమిటీ సభ్యులు, విద్యార్థి సంఘం నాయకులు, 24 వార్డ్ల ముఖ్య నాయకులు, కాంగ్రెస్ మహిళా కమిటీ, ప్రజలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page