Tuesday, March 24, 2026
HomeTelangana Newsఎయిర్ఇండియాకు రూ. కోటి జరిమానా విధించిన డీజీసీఏ

ఎయిర్ఇండియాకు రూ. కోటి జరిమానా విధించిన డీజీసీఏ

Loading

ఎయిర్ఇండియాకు రూ. కోటి జరిమానా విధించిన డీజీసీఏ

మన భద్రాద్రి బిజినెస్ బ్యూరో,

భారత విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) భద్రతా ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఎయిర్ ఇండియాకు రూ.1.10 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు బుధవారం విమానయాన సంస్థకు డీజీసీఏ నోటీసులు ఇచ్చింది. దూర ప్రాంతాలు, క్లిష్టమైన మార్గాల్లో ప్రయాణించే ఎయిర్ ఇండియా విమానాల్లో భద్రతాపరమైన నిబంధనలు పాటించడం లేదంటూ సంస్థ ఉద్యోగి డీజీసీఏకి తెలిపారు. అలాగే, లీజుకు తీసుకున్న విమానాల నిర్వహణను కూడా పట్టించుకోవడం లేదని ఉద్యోగి తన నివేదికలో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన డీజీసీఏ, ప్రాథమిక దర్యాప్తులో నిబంధనలు అనుసరించడం లేదంటూ జరిమానా విధించి, షోకాజ్ నోటీసులను పంపింది. ఎయిర్‌ లైన్ కంపెనీలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రయాణికులకు సేవలు అందించాలని డీజీసీఏ వెల్లడించింది. కాగా, గతేడాది డిసెంబర్‌ లో సైతం ఎయిర్ ఇండియాతో పాటు మరో విమానయాన సంస్థ స్పైస్‌ జెట్‌కు డీజీసీఏ షోకాజ్ నోటీసులిచ్చింది. పొగమంచు వల్ల ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విమానాలు నడిపేందుకు శిక్షణ కలిగిన పైలట్లను నియమించని కారణంగా ఈ నోటీసులు జారీ చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page