![]()
భద్రాచలం, మన భద్రాద్రి న్యూస్, జూన్ 06
ఐటిసి పిఎస్పిడి భద్రాచలం యూనిట్ కర్మాగారంలో 52 వ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వారి సహకారంతో కార్మికులు, మేనేజర్లు, గృహణీలు, పిల్లలు, హెడ్ మ్యానుఫ్యాక్టరింగ్ కె రాంబాబు, ఎన్విరాన్మెంట్ హెడ్ ప్ర పుల్లా కుమార్ సమంత సింగార్, టెక్నికల్ హెడ్ జేకే దాస్ లు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఐటిసి ఫ్యాక్టరీ గేట్ ముందు పర్యావరణ ర్యాలీలో కార్మికులు, మేనేజర్లు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కె రాంబాబు, పుల్లా కుమార్ సమంత సింగార్, జేకే దాస్, టీఎస్టీయూసీ యూనియన్ లీడర్ హరిప్రసాద్ హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన మార్గాల గురించి అందరికి అవగాహన కల్పించారు. అనంతరం వ్యాస రచన, చిత్రలేఖనం, నినాదాలు, క్విజ్ కాంపిటేషన్, తదితర పలు కార్యక్రమాలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రథానం చేశారు. చివరగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీఎస్ భాస్కర్, కె రవి కుమార్, చెంగల్ రావు, ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు, పాఠశాల పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.


