Monday, March 23, 2026
HomeTelangana NewsMuluguకనువిందు చేస్తున్న తెలంగాణ నయాగర బొగత జలపాతం

కనువిందు చేస్తున్న తెలంగాణ నయాగర బొగత జలపాతం

Loading

-ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో రైతు కళ్ళలో ఆనందం

ములుగు, మన భద్రాద్రి న్యూస్, జులై 01

వాజేడు మండలంలోని చీకుపల్లి గ్రామంలో ఉన్న తెలంగాణ నయాగర జలపాతంగా పేరుగాంచిన బొగత జలపాతం ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో పూర్తిగా జలకళ సంతరించుకుంది. ఈ బొగత జలపాతాన్ని చూడటానికి పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపడం విశేషం. తెలంగాణ రాష్ట్రమే కాకుండా ప్రక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, పొరుగునున్నటువంటి చత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి పర్యాటకులు నిత్యం బొగత జలపాతాన్ని సందర్శించుకుంటారు. జులై నెల మొదలుకొని దాదాపు అక్టోబర్ నెల చివరి వరకు బొగత జలపాతాన్ని సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. గత పది రోజులుగా వర్షం పడకపోవడంతో రైతులు దిగులుగా ఉండి ఒక్కసారిగా వర్షం పడడంతో నారుమడులకు నీరు లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా వరి నారుమల్లు పోసిన రైతులు నాట్లు కూడా వేసే అవకాశం ఉండేదేమోనని అనుమానం వ్యక్తం చేసేవారు. ఈ వర్షం వారి అనుమానాలను పటాపంచాలు చేసినట్లయింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page