Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemకలెక్టర్ కు మండల సమస్యలు వివరించిన పీఎస్ఆర్ - పీవీఆర్ యువసేన కాంగ్రెస్ నాయకులు

కలెక్టర్ కు మండల సమస్యలు వివరించిన పీఎస్ఆర్ – పీవీఆర్ యువసేన కాంగ్రెస్ నాయకులు

Loading

గుండాల, మన భద్రాద్రి న్యూస్

మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుక్రవారం పర్యటించారు. మండల పీఎస్ఆర్ – పీవీఆర్ యువసేన కాంగ్రెస్ నాయకులు, మిత్ర పక్షాలు కలెక్టర్ ను కలిసి పలు సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లారు. మండల కేంద్రంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలని, గ్రామీణ ప్రాంతాల నుండి మండల కేంద్రంలో వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు మరుగుదొడ్ల సౌకర్యం, మండల కేంద్రంలో ఉన్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ తదితర సమస్యలను వివరించారు. ఈ సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి, పరిష్కారిస్తామని హామీ ఇచ్చారని పీఎస్ఆర్ – పీవీఆర్ యువసేన మండల కో-ఆర్డినేటర్ ఎస్కే ఖధీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య, సీపీఐ మండల కార్యదర్శి వాగబోయిన రమేష్, టీడీపీ మండల అధ్యక్షులు తోలెం సాంబయ్య, ముత్తాపురం మాజీ సర్పంచ్ పూనెం సమ్మయ్య, పల్లపు రాజేష్, బొంగు చంద్రశేఖర్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page