![]()
కల్తీ కార్తీక్ పై కేసు నమోదు
జూలూరుపాడు, మన భద్రాద్రి న్యూస్, మే 21
గత రాత్రి అందాజా 11:20 గంటల సమయంలో రామచంద్రపురం గ్రామానికి చెందిన పదం చిన్న నరసింహారావు మరియు కల్తీ కార్తిక్ లు వ్యక్తిగత పనుల కొరకు జూలూరుపాడు వచ్చారని, కల్తీ కార్తిక్ బండి నడపగా చిన్న నరసింహారావు వెనకాల కూర్చున్నాడని, జూలూరుపాడు నందు పనులు ముగించుకొని తమ యొక్క గ్లామర్ మోటార్ సైకిల్ పై తిరుగు ప్రయాణమై రామచంద్రపురం వెళుతుండగా మార్గ మధ్యలో జూలూరుపాడు గ్రామ శివారుణ గల ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు వచ్చేసరికి అకస్మాత్తుగా గేదెలు అడ్డు రావడంతో వాటిని గుద్ది కింద పడిపోయినారని కింద పడిపోయిన పద్దం నరసింహారావుకు తీవ్ర గాయాలు అక్కడికక్కడే మృతి చెందినాడు అని, ద్విచక్ర వాహనమును అతివేగంగా ఆజాగ్రత్తగా నిర్లక్ష్యంగా నడిపి తన భర్త మృతికి కారకుడైన కల్తీ కార్తిక్ పై చట్టపరమైన చర్య తీసుకొనుట కొరకు మృతుడి భార్య పదం రోజా ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేయనైనది.


