Tuesday, March 24, 2026
HomeTelangana Newsకాంగ్రెస్ కౌంట్ డౌన్ మొదలైందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్

కాంగ్రెస్ కౌంట్ డౌన్ మొదలైందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్

Loading

  • బీజేపీదే ఎమ్మెల్సీ పదవీ

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో రికార్డు సృష్టించామని, కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలయిందని బండి సంజయ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు ఓటమిని రంజాన్ గిఫ్ట్ గా ఇస్తున్నామని, పండుగ చేసుకోమని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో 70 శాతం బీజేపీదేనని త్వరలో 100 శాతం సాధిస్తాని స్పష్టం చేశారు.

ఉత్తర తెలంగాణలో ఉత్కంఠగా రేపిన పట్టభద్రుల ఎమ్మెల్సీని బీజేపీ కైవసం చేసుకుంది. మొదటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో చివరకు బిజేపినే విజయం వరించింది.

రెండో ప్రాధాన్యత ఓటుతో గెలుపుకు కావాల్సిన కోటా ఓట్లు రానప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కంటే ఐదు వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో మొదటి స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డిని విజేతగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి ప్రకటించి గెలుపొందినట్లు ధ్రువీకరణ పత్రం అందజేశారు.

గెలుపుకు కావాల్సిన కోటా 111672 ఓట్లు రానప్పటికీ పోటీ చేసిన 56 మంది అభ్యర్థుల్లో 54 మందిని ఎలిమినేట్ చేసిన తర్వాత పోటీలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల్లో లీడ్ లో ఉన్న బీజేపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. యాభై శాతం ప్లస్ వన్ ఓటు రాకపోయినా విజేత గా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కన్నీటి పర్యంతమై కౌంటింగ్ కేంద్రం నుంచి నిష్క్రమించారు.

ఓటమి కాంగ్రెస్ కు రంజాన్ గిఫ్ట్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమిని రంజాన్ గిఫ్ట్ గా ఇచ్చామని పండుగ చేసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం వెలువడిన వెంటనే బీజేపీ శ్రేణులతో కలిసి బండి సంజయ్ కౌంటింగ్ కేంద్ర అంబేద్కర్ స్టేడియం వద్దకు చేరుకొని సంబరాల్లో పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఛాంపియన్ ట్రోఫీ లో బీజేపీ విజయం సాధించిందన్నారు.

ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు గుణపాఠమని తెలిపారు. ముస్లింలంతా ఏకమై బీజేపీని ఓడించాలని చూస్తే హిందూ సమాజమంతా కాంగ్రెస్ ను ఓడించి ఆ పార్టీకి ”రంజాన్” గిఫ్ట్ ఇచ్చారని పేర్కొన్నారు.

బీజేపీ కార్యకర్తల పోరాటాలకు హ్యాట్సాఫ్ చెప్పిన బండి సంజయ్ బీజేపీకి అండగా నిలిచిన ఓటరు మహాశయులకు శిరస్సు వంచి తెలంగాణ వందనాలు తెలిపారు. డబ్బులు పంచి గెలవాలని చూసిన కాంగ్రెస్ కు చెంప చెళ్లుమన్పించారని చెప్పారు. నోట్లు పంచిన వారిని వదిలిపెట్టబోమని, గూగుల్ పే వివరాల లెక్కలు తీస్తున్నామని తెలిపారు.

తెలంగాణ ఇక మాదే

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో 70% బీజేపీదేనని రాబోయే రోజుల్లో 100% సాధిస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మార్పు కోరుతున్న ప్రజలకు బీజేపీ దిక్సూచిలా కన్పించిందని ఇకపై ఏ ఎన్నికలు జరిగినా విజయపరంపర బీజేపీదేనని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్దికి నిధులిస్తోంది కేంద్ర ప్రభుత్వమేనని, సొమ్ము కేంద్రానిదైతే సోకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటోందని విమర్శించారు.

ప్రజలు అన్నీ గమనిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధమైనారని తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ యుద్దం చేసేందుకు సిద్ధమవుతుందని తెలిపారు. రాష్ట్రంలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లు రాష్ట్ర ప్రభుత్వ పాలనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ తీర్పు ఇచ్చారని చెప్పారు.

ఈవీఎంలో ట్యాపరింగ్ అన్న కాంగ్రెస్ సమాధానం చెప్పాలి

ఈవీఎంలను మేనేజ్ చేసి బీజేపీ గెలుస్తుందని పదేపదే దుష్ప్రచారం చేసిన రాహుల్ గాంధీకి బండి సంజయ్ సవాల్ విసిరారు. ఈవీఎంల ద్వారా మాత్రమే కాదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిర్వహించిన బ్యాలెట్ పేపర్ ద్వారా కూడా బీజేపీయే గెలిచిందని, దీనికేం సమాధానం చెబుతారని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.

బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేసినా, డబ్బు సంచులను పంచినా ఓటుకు రూ.5 వేల చొప్పున పంచినా వారి కుట్రలు ఫలించలేదన్నారు. మేం నయాపైసా ఖర్చు చేయలేదని, మా కార్యకర్తలే ఇంటింటికీ తిరిగారని, వారి కష్టం, మోదీ పాలన, అమ్మవారి దయవల్లే మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చి కాంగ్రెస్, బీఆర్ఎస్ చెంప చెల్లుమనిపించారని తెలిపారు.

బీఆర్ఎస్ మద్దతుతో ప్రసన్న మూడో ప్లేస్

వాస్తవానికి బీఎస్పీ అభ్యర్ధి రెండవ స్థానానికి వస్తారని భావించామని, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆయనకు మద్దతు ఇవ్వడంతో ప్రజలు ఆ అభ్యర్ధిని మూడవ స్థానానికి పరిమితం చేశారని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ ఆదాయంలో హైదరాబాద్ వాటా అధికం. కానీ వెనుకబడ్డ ఆదిలాబాద్ లో నిధులు ఎక్కువ ఖర్చు చేస్తోంది. దీనినేమంటారని ప్రశ్నించారు.

అట్లాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీసీ సమాజం, హిందూ సమాజం ఓట్లేసి గెలిపించింది. ఒక వర్గానికి కొమ్ముకాస్తున్న కాంగ్రెస్ పార్టీ యావత్ హిందూ సమాజం ఈ తీర్పు ద్వారా ”రంజాన్” గిఫ్ట్ ఇచ్చిందన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పక్షాన ఉన్నారని భావిస్తే తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు త్వరగా నిర్వహిస్తే బీజేపీ దమ్మేందో చూపిస్తామని బండి సంజయ్ అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page