![]()
కాంట్రాక్టు కార్మికుల స్కిల్డ్ మ్యాట్రిక్స్ లో జరిగిన అవకతవకలు సరి చేయాలి – INTUC మిత్రపక్షాలు HR హెడ్ కి వినతి
సారపాక, మన భద్రాద్రి బ్యూరో, మార్చి 26
13వ వేతన ఒప్పందములో కాంట్రాక్టు కార్మికుల మినిట్స్ ఆఫ్ ది కన్సాలిడేషన్ ప్రొసీడింగ్స్ తేది. 06-04-2022, క్లాజు నెం.4 స్కిల్ అప్ గ్రేడేషన్ ప్రకారం మన మిల్లులో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు స్కిల్డ్ మ్యాట్రిక్స్ అమలు చేయాలని, ఇన్ టైం లో LTA పూర్తి అయినప్పటికి థర్డ్ పార్టీ సర్వే పేరుతో 2 1/2 సం॥లు కాలయాపన చేసి దీనిని ది.01-10-2024 నుండి అమలు చేస్తున్నాము అని కాంట్రాక్టు కార్మికులకు తెలియజేయడం జరిగింది. దీని వల్ల సుమారు 4 కోట్ల రూపాయలు కాంట్రాక్టు కార్మికులు నష్టపోయారు. థర్డ్ పార్టీ సర్వే పేరుతో యాజమాన్యం మరియు గుర్తింపు సంఘం కుమ్మక్కై తీసుకున్న నిర్ణయం వల్ల కాంట్రాక్టు కార్మికులలో తీవ్రమైన వ్యతిరేకత నెలకొనియుంది.
కావున గతంలో వలే ఈ క్రింది అంశాల ప్రకారం స్కిల్డ్ మ్యాట్రిక్స్ ను అమలు చేయాలని INTUC మిత్రపక్షాల యూనియన్ డిమాండ్ చేస్తుంది.
- – థర్డ్ పార్టీ చేసిన సర్వే రిపోర్టును వెంటనే నోటీసు బోర్డులో పెట్టాలి.
- – స్కిల్డ్ మ్యాట్రిక్స్ అమలు విషయంలో ది. 01-04-2009 పెట్టిన కటాఫ్ డేట్ ను తీసివేయాలి.
- – ప్రస్తుతం అమలు చేసిన 16 సం॥లు సర్వీసు కాకుండా గతంలో వలె అన్-స్కిల్డ్ నుండి సెమీస్కిల్ కు 7 సం॥లు, సెమీ-స్కిల్డ్ నుండి స్కిల్ల్ కు 6 సం॥లు సర్వీసును ప్రామాణికంగా తీసుకుని అర్హులైన వారందరికీ ఒకేసారి స్కిల్డ్ మ్యాట్రిక్స్ ను అమలు చేయాలి.
- – కొన్ని పని ప్రదేశాలలో కార్మికులు స్కిల్ట్, సెమీస్కిల్డ్ పనులు చేస్తున్నప్పటికీ వారిని అన్ స్కిల్డ్ గానే పరిగణించారు. దీనిని సరిచేయాలని డిమాండు చేస్తున్నాం.
- – కొన్ని డిపార్టుమెంటుల్లో HOD లు థర్ట్ పార్టీకి కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న పని గురించి క్షుణంగా వివరించకపోవడం వల్ల థర్డ్ పార్టీ వారు ఇచ్చిన రిపోర్టు వల్ల చాలా మంది కాంట్రాక్టు కార్మికులకు అప్ గ్రేడేషన్ చేయలేదు. దీనిని పునఃసమీక్షించి, వారికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో INTUC మిత్రపక్షాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోనె రామారావు, యారం పిచ్చిరెడ్డి, INTUC కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ నాయకులు, ఐఎన్టియుసి మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు, కాంట్రాక్టర్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు


