![]()
కార్మికుల్లో వెళ్లివిరిసిన మానవత్వం
- తోటి కార్మికునికి ఆర్థిక చేయూత అందించిన వైనం
బూర్గంపహాడ్, మన భద్రాద్రి
బూర్గంపాడు మండలం, సారపాక లోని ఐటీసీ పేపర్ కర్మాగారం లో ఎన్.ఎస్. ఎఫ్.టి డిపార్ట్మెంట్లో కాంట్రాక్టు కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న కోటమర్తి శ్రీను ఆరోగ్య పరిస్థితి బాగాలేక విధులకు హాజరు కావట్లేదు. వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఎన్.ఎస్.ఎఫ్.టి డిపార్ట్మెంట్ ఎంప్లాయిస్, మేనేజర్స్, కాంట్రాక్ట్ కార్మికులు మరియు ఇతర దాతల సహకారంతో సేకరించిన విరాళాలు 35,100 రూపాయలు ఈరోజు అనగా 20వ తేదీన గాంధీనగర్ లోని వారి స్వగృహానికి వెళ్లి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శేషగిరి రావు, ఉమా, లెనిన్ , సాంబారెడ్డి, నగేష్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, శంకరయ్య, నరేష్, వేణు, రమణ, శ్రీనివాస్, రవి, శ్రీను, రామకృష్ణ మరియు పలువురు తోటి ఉద్యోగులు పాల్గొన్నారు.


