![]()
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్, ఆగస్టు 10
గార్ల మండల పరిధిలోనీ గోపాలపురం గ్రామానికి చెందిన మండల యువజన కాంగ్రెస్ నాయకులు గోస్ నాగేష్ ఇటీవలే ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి చికిత్స నిమిత్తం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న నాగేష్ ని వారి నివాసానికి వెళ్ళి పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య. వారితో పాటు గార్ల మండల పి ఏ సి ఎస్ చైర్మన్ దుర్గ ప్రసాద్, గార్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధనియాకుల రామారావు, మహబూబాబాద్ జిల్లా నాయకులు గుండా వెంకట్ రెడ్డి, ఇల్లందు మార్కెట్ చైర్మన్ రాంబాబు, మాజీ మార్కెట్ చైర్మన్ నాగేశ్వరావు, డైరెక్టర్ అశోక్,గార్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హథీరాం, కోల కుమార్, మోతీలాల్, లెనిన్, ప్రశాంత్, వస్య, గుడిచుట్టు నవీన్ యాదవ్ టీపీసీసీ సోషల్ మీడియా గార్ల మండల కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.


