Monday, March 23, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemకాలేశ్వరం దోపిడి పై సిబిఐ విచారణకు సిద్ధం కావాలి

కాలేశ్వరం దోపిడి పై సిబిఐ విచారణకు సిద్ధం కావాలి

Loading

కాలేశ్వరం దోపిడి పై సిబిఐ విచారణకు సిద్ధం కావాలి

బిఆర్ఎస్ 7 లక్షల కోట్లతో అప్పుల రాష్ట్రంగా మార్చింది

మణుగూరు: కాలేశ్వరం ప్రాజెక్ట్ పై బిఆర్ఎస్ నాయకులు సిబిఐ విచారణ సిద్ధంగా ఉండాలని ఏడు లక్షల కోట్లతో రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది మీరు కదా అని కాంగ్రెస్ మండల అధ్యక్షులు పీర్నాకి నవీన్ అన్నారు గురువారం మణుగూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీరినాకి నవీన్ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నిజంగా మీకు మీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కాలేశ్వరంపై సి.బి.ఐ విచారణకు సిద్ధంగా ఉండి నిరూపించుకోవాలన్నారు విచారణ అనగానే హైకోర్టుకు వెళ్లి పియూష్ ఘోష్ కమిషన్ కమిషన్ రిపోర్ట్ శాసనసభకు రాకుండా స్టే ఆర్డర్ ఇవ్వాలి అని హైకోర్టును కోరింది మీరే మీ నాయకులు కాదా అని ప్రశ్నించారు. మేడిగడ్డలో నీరు నిలువ చేయొద్దని ఎన్ డి ఎస్ ఏ తెలిపింది.80 వేల పుస్తకాలు చదివిన అపర మేధావి అని చెప్పుకునే మీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు సొంత నిర్ణయంతో లక్షల కోట్లు దోపిడీ చేసి నాసిరకం నిర్మాణం చేసింది నిజం కాదా అన్నారు బీటలు వారిని నిజం కాదా అన్నారు నువ్వు నీ నాయకులు ని పార్టీ అరాచకాలకు జనాలు భయపడి కాంగ్రెస్ పాలన కావాలి అని ప్రజలు భయం గుప్పెట్లో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రజా పాలన ప్రజలు తీసుకొచ్చుకున్నారని అన్నారు 6 పథకాలు అమలు జరుగుతున్న క్రమంలో ప్రజాదరణ చూసి ఓర్చుకోలేక, తట్టుకోలేక భయపడుతున్నారని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బి.ఆర్.ఎస్ పార్టీని బొంద పెడతారు అని గ్రహించి ప్రజా ఆదరణ గల నాయకుల పై ఆరోపణలు చేస్తే నీకు ఏదో క్రెజ్ వస్తుందని అపోహతో సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీపై బురద చల్లుదామని చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు శివ సైదులు, నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి, శివాలయం గుడి చైర్మన్ కూచిపూడి బాబు, మైనారిటీ అధ్యక్షులు ఎండి రహీం, మండల నాయకులు, టీవి సుబ్బారెడ్డి, పాతూరి వెంకన్న, గాండ్ల సురేష్, చింతల కృష్ణ, మహబూబ్, కటుకూరి శ్రీను. యువజన నాయకులు పల్లం నాగేశ్వరరావు, ఏనిక దినేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page